Thursday, May 28, 2026

Creating liberating content

తాజా వార్తలుమాజీ మంత్రి చినరాజప్ప కారుకు ప్రమాదం..క్షేమంగా బయటపడ్డ మంత్రి

మాజీ మంత్రి చినరాజప్ప కారుకు ప్రమాదం..క్షేమంగా బయటపడ్డ మంత్రి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి చినరాజప్ప క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి చినరాజప్పకు పెద్దాపురం టికెట్ దక్కింది. దీంతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దాపురంలో ర్యాలీ నిర్వహించారు. చినరాజప్ప కారు బానెట్ పై గజమాల వేసి ఊరేగించారు. ఈ క్రమంలో దర్గా సెంటర్ వద్ద సడెన్ గా అడ్డువచ్చిన వ్యక్తిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో కారు ఆ పక్కనే ఉన్న డివైడర్ పైకెక్కింది. వెంటనే స్పందించిన కార్యకర్తలు చినరాజప్పను బయటకు తీశారు. ఆపై మరో కారులో చినరాజప్ప ఇంటికి వెళ్లిపోయారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article