తుని :అభివృద్ధి సంక్షేమ పథకాలకు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య కోరారు.జగన్ పాలనపై విసుగెత్తిన ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంంలో భాగంగా బెండపూడి పంచాయితీ
సుబ్బరాయిపురంలో యనమల దివ్యబాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన యనమల దివ్యకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య కు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు.పూల వర్షం కురిపించారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె వచ్చేదీ
ఉమ్మడి ప్రభుత్వమని, అధికారం
చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు.తెలుగు దేశం సూపర్ సిక్స్
పధకాలను వివరిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం కృషి
చేస్తుందన్నారు.ఈకార్యక్రమంలో
స్థానిక తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు
