Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుఆ పోస్టులు తొలగించండి.. చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు

ఆ పోస్టులు తొలగించండి.. చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్‌ పెట్టిందని.. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్‌ కుమార్‌మీనా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article