Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలువైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి రాష్టాభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి రాష్టాభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

వైసిపి పాలనకు చరమగీతం పాడుదాం.
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.
గ్రామ గ్రామాన ప్రజల నీరా జనాలు
మహిళల మంగళారతులు
ప్రచారానికి శ్రీకారం చుట్టిన టిడిపి అభ్యర్థి సవిత
శ్రీ సత్య సాయి జిల్లా.:రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ పాలనకు చమర గీతం పాడాలని పెనుగొండ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి సవిత ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం పెనుకొండ మండలంలో మునిమడుగు గ్రామంలో బుధవారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు.. ఆమె పలు గ్రామాలలో పర్యటించి పలు సభలలో ప్రసంగించారు. గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా వచ్చిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గం సైతం గతంలో టిడిపి హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు మా తండ్రి దివంగత ఎస్ రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు.పరిటాల రవీంద్ర మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు నిర్మించారన్నారు. మునిమడుగు గ్రామ చెరువుగట్టు తెగిపోవడంతో అప్పటి ఎమ్మెల్యే బీకే పార్థసారథి చెరువు కట్ట మరమ్మత్తులు చేయించి శాశ్వత పరిష్కారం చూపించారన్నారు..వైసిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే శంకర్నారాయణ 5ఏళ్ళు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు.అధికార పార్టీ వైసీపీ పబ్బం కడుపుకునేదానికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చోట సచివాలయం నిర్మించి పెండింగ్ లో పెట్టించిన ఘనత వైసీపీ అధికార పార్టీ నాయకులకి దక్కుతుందన్నారు
ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ లో ఉమ్మడిఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి గా చేసుకుందామని కోరారు.
*అడగడగనా ప్రజల నీరాజనాలు

ఉమ్మడి అభ్యర్థి సవిత గురువారం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలంలో మునిమడుగు గుట్టూరు అమ్మవారు పల్లి చిన్నపరెడ్డిపల్లి మోటారుపల్లి రాంపురం హరిపురంగ్రామాలలో పర్యటించారు. ఆమె పర్యటనలో గ్రామ గ్రామాన ప్రజలు నీరాజనాలు పట్టారు పెద్ద ఎత్తున మహిళలు యువకులు హాజరయ్యారు గ్రామ గ్రామాన మహిళలు అమె మంగళ హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి చిందులు తొక్కారు . ఆమె పర్యటన సందర్భంగా గ్రామాలు పార్టీ జెండాలు తోరణాలు పసుపు మయంగా మారాయి తెలుగుదేశం కార్యకర్తలు అడగడు తెలుగుదేశం జిందాబాద్ సవిత నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాలలో తెలుగుదేశం నాయకులు ముని మడుగు వెంకటరాముడు రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు గుంటూరు మాజీ సర్పంచ్ మంచినీళ్ల సూర్యనారాయణ
తెలుగుదేశం నాయకులు కొండారెడ్డి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article