Wednesday, November 12, 2025

Creating liberating content

తాజా వార్తలుగీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

తెనాలి యువతి గీతాంజలి విపక్షాల ట్రోలింగ్ కారణంగానే బలవన్మరణం చెందిందంటూ అధికార వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్ఠలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article