తాజా వార్తలుయనమలకు జై కొట్టిన ఎస్ అన్నవరం యువకులు

యనమలకు జై కొట్టిన ఎస్ అన్నవరం యువకులు

దివ్య గెలుపు కోసం టీడీపీలో చేరిక

తుని :తుని మండలం ఎస్ అన్నవరంలో తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తుంది.
సుపరిపాలకుడు యనమల రామకృష్ణుడు నాయకత్వంలోనే తుని నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని గుర్తెరిగన యువత సైకిలే బెస్ట్ అంటున్నారు.
విద్యావంతురాలు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య యువ నాయకత్వంలో పనిచేసేందుకు ఎస్ అన్నవరం పంచాయితీకి యువకులు ముందుకు వచ్చారు
సీనియర్ నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు బోడాల జమీలు ఆధ్వర్యంలో ఏ శ్రీనివాసరావు, వి కిరణ్, డి.బాబి, కే శ్రీనివాస్, పి హేమంత్, కే శివ సాయి, ఏ వంశీ,సి.జాన్ తదితరులు పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పిన యనమల రామకృష్ణుడు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు అప్పన రమేష్, బొబ్బిలి వెంకటరమణ, నాళం వెంకటరమణ, పంచాడ శ్రీనివాస్, చోడిశెట్టి దొంగబాబు, పోలిశెట్టి ధర బాబు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article