టాప్ న్యూస్నేడు ఢిల్లీకి చంద్ర‌బాబు

నేడు ఢిల్లీకి చంద్ర‌బాబు

బీజేపీతో పొత్తులో భాగంగా కీల‌క మంత‌నాలు

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లపై క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు. దీనిలో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ ప‌ర్యట‌న ఖ‌రారైంది. చంద్ర‌బాబు గురువారం ఢిల్లీ వెళ్ల‌నున్నారు. బీజేపీతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో పొత్తు విష‌య‌మై ఢిల్లీలో కీల‌క చ‌ర్చ‌లు జ‌రప‌నున్నారు. ఇక బుధ‌వారం ఉద‌యం జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయిన విష‌యం తెలిసిందే. సుమారు గంట‌న్న‌ర పాటు ఈ స‌మావేశం జ‌రిగింది. ఇందులో ఢిల్లీ అంశాల‌తో పాటు రెండో ఉమ్మ‌డి జాబితాలోని అభ్య‌ర్థుల విష‌యమై కూడా ఇరువురు అధినేత‌లు కీల‌క మంత‌నాలు జ‌రిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article