Sunday, February 15, 2026

Creating liberating content

క్రీడలుఆల్‌టైమ్ రికార్డుకు చేరువైన రవిచంద్రన్ అశ్విన్

ఆల్‌టైమ్ రికార్డుకు చేరువైన రవిచంద్రన్ అశ్విన్

ఇండియా, ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరగబోతున్న 5వ టెస్టుతో కెరియర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్‌ను ఆడబోతున్న దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ఆల్ టైమ్ రికార్డుపై కన్నేశాడు. టెస్టు ఫార్మాట్ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు’ గెలుచుకున్న భారతీయ క్రికెటర్‌గా ఉన్న అశ్విన్.. అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాలోనూ అగ్రస్థానం దిశగా చేరువవుతున్నాడు. ఇప్పటివరకు అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు’లు గెలుచుకున్న ఆటగాడిగా శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 11 ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల’తో ముత్తయ్య అగ్రస్థానంలో ఉండగా, 10 అవార్డులతో అశ్విన్ రెండవ స్థానంలో నిలిచాడు. అశ్విన్ మరో అవార్డు అందుకుంటే మురళీధరన్‌తో సమంగా నిలవనున్నాడు.ఇక టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న టాప్-5 ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ మూడో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 9 టెస్టుల సిరీస్‌లో ఈ అవార్డు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌ ఆటగాడు ఇమ్రాన్‌ ఖాన్‌ మొత్తం 8 ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులతో నాలుగవ స్థానంలో నిలిచాడు. 28 సిరీస్‌లలో ఈ అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఇక న్యూజిలాండ్‌కు చెందిన సర్ రిచర్డ్ హ్యాడ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. మొత్తం 33 టెస్టు సిరీస్‌లు ఆడిన రిచర్డ్ హ్యాడ్లీ 8 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article