Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఇకపై ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవం

ఇకపై ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవం

ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించింది. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ఏర్పాటైంది జూన్ 20వ తేదీన. ఇప్పుడు 238 ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ప్రకటించారు.ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు, నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్రం ప్రభుత్వం పేర్కొంది. పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను ఆ రోజున సన్మానించుకోవాలని సూచించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ (జీవో ఎంఎస్ నెం.81) విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article