గాజువాక:స్వామి విద్యానికేతన్ హై స్కూల్, స్కూల్ చుట్టుప్రక్కల రోడ్లు కాలువలు కల్వర్టులు శంకుస్థాపనలు జరిగాయి. 67వ వార్డు 6 వ జోన్ విశాఖపట్నం మేయర్, గొలగాని హరి వెంకట కుమారి, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి , 67వ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గ వైయస్సార్ సిపి ఇంచార్జి చందు, మార్కెటింగ్ చైర్మన్ పల్లా చిన తల్లి తదితరులను కూర్మమ్మ స్కౌట్ ట్రూప్ విద్యార్థులు మరియు కూర్మమ్మ గైడ్ కంపెనీ విద్యార్థినిలు కలర్ పార్టీతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఎడిసి ( ఎస్ ) డాక్టర్ పాలూరు లక్ష్మణస్వామి, గైడ్ టీచర్ టి సూర్య కుమారి కబ్స్ మరియు బుల్ బుల్స్ ఇన్చార్జెస్ జి పద్మజ మరియు సింగిరెడ్డి లక్ష్మి తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సాయికిరణ్, లక్ష్మి టీచర్, రమా టీచర్, కుమార్ సార్ తదితరులు పాల్గొన్నారని స్కూల్ కరస్పాండెంట్ పి దేవి తెలిపారు .

