జీలుగుమిల్లి
జగనన్నపాలెంలో అభివృద్ధి కనపడటం లేదు అనేటటువంటి వారికి ఒక కోటి 65 లక్షల రూపాయల ఇ సీసీ రోడ్లే వాళ్లకి నిదర్శనమని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని జగదాంబ సెంటర్లోని సిసి రోడ్లు పోలవరం ఇన్చార్జి తెల్ల రాజ్యలక్ష్మి సమక్షంలో ప్రారంభోత్సవం చేశారు. తాటి ఆకుల గూడెం పంచాయతీలో 40 లక్షల రూపాయలతో రెండు సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేశారు. 44 లక్షల రూపాయలతో రైతులకు ఉపయుక్తంగా ఉండే గోడెలను రెండు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు రోడ్లు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్పిటిసి వసంతరావు ఎంపీటీసీ సును సురేషు. మోడీ వెంకటలక్ష్మి, సర్పంచి మనుమ రాంబాబు సొసైటీ చైర్మన్ బోధ శ్రీనివాసరెడ్డి శ్రీను నీరుసు రవి, జగదాంబ ఆలయ చైర్మన్ కక్కిరాల రాము, టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు, గంధం బోసు చాపల లక్ష్మణరావు చిట్టిబాబు శ్రీనివాసరావు మరో కొల్లి కనకరాజు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.