తాజా వార్తలువిశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం

విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం

బ్రిడ్జిని ప్రారంభించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అమర్నాథ్

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోటీ అరవై లక్షలతో జగన్ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని అన్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్లోటింగ్ వంతెన వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో విశాఖలో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article