Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుఎస్సై ఉద్యోగాలు సాధించిన నలుగురు కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ సన్మానం

ఎస్సై ఉద్యోగాలు సాధించిన నలుగురు కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ సన్మానం

  • శిక్షణ కోసం రిలీవ్ ఐన వారికి ఎస్పీ అభినందనలు
  • అనంతపురము బ్యూరో
    జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా పని చేస్తూ ఎస్సై ఉద్యోగాలు సాధించిన నలుగురు పోలీసులు శుక్రవారం శిక్షణ నిమిత్తం రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సన్మానించారు. వీరు 2018 బ్యాచ్ నకు చెందిన వారు. బుక్కరాయ సముద్రం మండలం రేగడి కొత్తూరుకు చెందిన వి.మణికంఠేశ్వరరెడ్డి ప్రస్తుతం జిల్లా పోలీస్ సైబర్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. కర్నూలు జిల్లా రామాపురానికి చెందిన జి.సూర్య నారాయణ రెడ్డి జిల్లాలోని గుమ్మఘట్ట పోలీసు స్టేషన్లో, పెద్దపప్పూరు మండలం యక్కలూరుకు చెందిన పి.శ్రావణి గుత్తి పోలీసు స్టేషన్లో, శింగనమల మండలం నాగులగుడ్డం తాండాకు చెందిన వెంకట లక్ష్మి అనంతపురం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. వీరంతా ఇటీవల జరిగిన ఎస్సై ఉద్యోగాల నియామకంలో ఉద్యోగాలు సాధించారు. ఎస్సై ఉద్యోగ శిక్షణ కోసం వీరంతా జిల్లాలో చేస్తున్న విధుల నుండీ రిలీవ్ అయ్యారు. వీరందర్నీ ఈరోజు జిల్లా ఎస్పీ సన్మానించి చేసి మెమొంటోలు అందజేశారు. ఎస్బీ సి.ఐ.జాకీర్ హుస్సేన్, సైబర్ విభాగం సి.ఐ. షేక్ జాకీర్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article