తాజా వార్తలువాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలు

వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలు

ఏలేశ్వరం:-దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అని ప్రత్తిపాడు నియోజకవర్గం వైకాపా ఇన్చార్జ్ వరుపుల సుబ్బారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక వేదిక ఫంక్షన్ హాల్ వద్ద వాలంటీర్లకు సేవా మిత్ర- సేవ రత్న -సేవ వజ్రా పురస్కారాలను వరుపుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వాలంటీర్లు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యవస్థని పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అందుతుందంటే దానికి ముఖ్య కారణం వాలంటీర్లని, కరోనా సమయంలో సేవలు గాని ఇతరత్రా కార్యక్రమంలో వారిని చేసే సేవలు గాని చాలా గొప్పవని రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి కుటుంబానికి తెలియపరచాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి అనంత ఉదయ భాస్కర్, పర్వత రాజబాబు,మండల కన్వీనర్ అడపా పార్థసారథి వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు నగర పంచాయతీ కమిషనర్ కే శివప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయుకులు కార్యకర్తలు, ఏలేశ్వరం మండలం అర్బన్,రూరల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article