తాజా వార్తలుచత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలి

చత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలి

గౌరవ అధ్యక్షులు అంబారపు వెంకటేశ్వర్లు

కడప సిటీ

ప్రస్తుత పరిస్థితుల్లో చత్రపతి శివాజీ మహారాజును యువత ఆదర్శంగా తీసుకో వలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఆదివారం శోభాయాత్ర లో అందరూ పాల్గొని విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉందని, చత్రపతి శివాజీ ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు అంబారపు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కడప నగరంలో శివాజీ శోభాయాత్ర నిర్వహించారు. కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ సమీపంలోని అంబాభవాని ఆలయం వద్ద నుండి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి కడప ప్రధాన కూడలి మీదుగా యాత్ర సాగింది. ఈ శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19 న ప్రతి హిందువు ఘనంగా నిర్వహించుకుంటున్నారని, ఇందులో భాగంగా ముందస్తు వేడుకలను ఆదివారం కడపలో శోభయాత్రలో రూపంలో నిర్వహించామన్నారు. ప్రతి హిందువు హిందువుగా జీవించాలని హిందువుగా గర్వించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఈ శోభాయాత్రలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,టిడిపి కడప ఇన్చార్జ్ మాధవి రెడ్డిలు పాల్గొని కోలాటం వేసి అందరిని ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రవిశంకర్ రావు చవన్, సురేష్ ట్రెజరర్ వీరేంద్రరావు, సభ్యులు నాగార్జున, జగదీష్, నిఖిల్, పెద్ద ఎత్తున హిందూ ధార్మిక వేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article