కోటనందూరు
తుని నియోజకవర్గంలో వార్ వన్ సైడేనని యనమల దివ్య గెలుపు తధ్యమంటున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు ఈసారి 30 వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న యనమల కృష్ణుడు రేయి అనకా పగలనకా కష్టపడుతున్నారు. ఉదయం 6 గంటలకు తన నివాసం వద్దకు వచ్చే తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై విషయాన్ని నిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పల్లె పల్లెను చుట్టిముట్టి వచ్చి పార్టీకి గట్టి పునాదులు వేస్తున్నారు. ఎక్కడ అసంబంతి స్వరం వినిపించకుండా గ్రామస్థాయి కార్యకర్తలతో భేటీ అయి, పార్టీ యంత్రాంగాన్ని ఒకే తాటిపై నడిపిస్తున్నారు. కలిసోచ్చేవారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.ఇందులో భాగంగా
కోటనందూరు మండల టీడీపీ అధ్యక్షులు గాడి రాజుబాబు ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామ వైయస్సార్ పార్టీ యువనాయకులు యండ్ర శ్రీను, దార వీరసత్తిబాబు, పాలిక ప్రసాద్, పాలిక రాజేష్, పాలిక శ్యామ్, దార శ్రీను, తోలేం దుర్గ, చింతకుల హేమంత్ వారితోపాటు 50మంది యువత వైసీపీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్ అయ్యారు.
వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు గారు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా పార్టీలోకి జాయిన్ అయిన వారు రాష్ట్ర అభివృద్ధి, యువతకి బంగారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టితోనే సాధ్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు గారు, కోటనందూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్, చింతకాయల రవి పాల్గొన్నారు…