తాజా వార్తలుజనసేన కార్యకర్తలను కలిసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి

జనసేన కార్యకర్తలను కలిసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి

వేలేరుపాడు,

బీజేపీ పల్లె నిద్ర లో భాగంగా వేలేరుపాడు మండలంలో ఆదివారం పర్యటించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన చౌదరి ) జనసేన కార్యాలయం మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పకుండ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది అని అన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతలు, జనసేన పార్టీ సిద్ధంతాలు రెండు ఒక్కేవిధంగా ఉన్నాయని ఇటు రాష్ట్రంలో అటు దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయలని కార్యకర్తలందరు వైసీపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అన్నారు. నిర్వసితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను అని తప్పకుండ సమస్యలు పరిస్కార దిశగా వెళ్తామని అన్నారు. అదేవిధంగా జనసేన మండల అధ్యక్షులు గణేషుల ఆదినారాయణ పలు సమస్యలతో కూడిన వినతిపత్రన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్సులు మేచినేని సంజయ్, కొవ్వాలా క్రాంతికుమార్, సుధాకర్, పొట్ల మోహన్, కేచ్చేల శ్రీను, భాను, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article