తాజా వార్తలుపట్నం ఎస్ఐగా నరసింహుడు

పట్నం ఎస్ఐగా నరసింహుడు

ముదిగుబ్బ
ముదిగుబ్బ మండలంలోని మొలకవేమలలోగల పట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నరసింహుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ ఇసాక్ తిరుపతి జిల్లాకు బదిలీ కాగా బుక్కపట్నం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు పట్నం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎక్కువగా జాతీయ రహదారి ఉన్నందున ప్రమాదాలు నివారించడంతోపాటు ఎన్నికల నేపథ్యంలో తరచూ వాహనతనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో రోజుకొక గ్రామాన్ని సందర్శించి ప్రజలను ఎన్నికలనేపథ్యంలో చైతన్యవంతులను చేయడమే గాక ఫ్రెండ్లీకలయిక నిర్వహిస్తూ, ఫ్యాక్షన్ గ్రామాలపై నేటినుండి ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేకనిఘ ఉంచాలని సిబ్బందికి సూచించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article