తాజా వార్తలుటీడీపీ తీర్థం పుచ్చుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే?

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే?

మైలవరం:ఈ నెల 8 తరువాత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారే అవకాశం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధం సభకు తాను హాజరుకాబోనని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ జోక్యం చేసుకుంటున్నారంటూ వసంత కృష్ణ ప్రసాద్ గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల సీఎం ఎమ్మెల్యేను పిలిపించి చంద్రబాబు, నారా లోకేశ్‌పై విమర్శలు చేయాలని కూడా సూచించారట. విమర్శలు చేసే వారినే తన వారిగా గుర్తిస్తానని స్పష్టం చేశారట. కానీ, ఇది తనవల్ల కాదని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పినట్టు సమాచారం.
మరోవైపు, వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ శుక్రవారం జడ్పీటీసీ తిరుపతి రావు యాదవ్‌ను ఇంచార్జ్‌గా ప్రకటించింది. ఇదిలా ఉంటే, నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article