జీలుగుమిల్లి
రానున్న ఎన్నికలలో జగనన్నకు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుందని పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. పోలవరం నియోజవర్గంలో అన్ని మండలాలు విస్తృత పర్యటన చేస్తూ ఆత్మీయ పలకరింపులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సమస్యలు కూడా అడుగు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలపై ఆమె దృష్టి పెట్టారు.
జీలుగుమల్లి మండలం లక్ష్మిపురం గ్రామం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొల్లూరి రాంబాబు ని తన స్వగృహంలో కలిసి కొల్లూరి రాంబాబు ని పలకరించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు , స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో , కేతిరెడ్డి రాఘవరెడ్డి,
కొప్పుల చౌదరారెడ్డి, పైడిమర్ల జగన్మోహన్ రెడ్డి, సున్నం సురేష్ గారు పాల్గొన్నారు.

