తాజా వార్తలుఅనారోగ్యంతో మాజీ మంత్రి పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత

అనారోగ్యంతో మాజీ మంత్రి పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి (93) సోమవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు.1972 నుంచి రెండేళ్ల పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేశారు. జలగం వెంగళరావు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్ లో ఆయన నివాసముంటున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article