టాప్ న్యూస్ఓ ప్రజాస్వామ్యమా.. ఎక్కడున్నావే నీవు...!

ఓ ప్రజాస్వామ్యమా.. ఎక్కడున్నావే నీవు…!

*ఓ నిండు ప్రాణం పోయింది..
*ఇంకో ప్రాణం పోయాక ఇలానే అంటుంటే…
*మరో ప్రాణం పోతుందని కొట్టుకుంటుంది…
*తప్పెవరిది…ఒప్పెవరిది..
*ఉద్యోగం లేకపోతే, ఇవ్వకపోతే ఓ ఉద్యమం..
*ఉద్యోగం వచ్చాక హక్కుల కోసం మరో ఉద్యమం…
*జీతాలు ఇవ్వలేదని ఒక ఉద్యమం…
*ఇచ్చే జీతాలు చాల లేదని ఒక ఉద్యమం..
*ఏది చూసినా..ఎటు చూసినా ఉద్యమమే ఆయుధం అవుతుంటే…
*ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండే దెందుకు..
*ఈ పాలకులు పాలించే దెందుకు…
*అధికారం కోసం ఇన్ని చేస్తూ…
*అధికారం పోతే అడ్డంగా రోడ్డెక్కుతూ ఉంటుంటే…
*అధికారం ఉంటే ఒక మాట..పోతే మరో మాట..
*ప్రజలు,ప్రజాస్వామ్యం అన్నది పొసుపోని కబుర్లేనా…
*మారాల్సింది ప్రజలా పాలకులా…
*అసలు ఉద్యమాలకు అధ్యులెవరు..
*ఈ పాలకులు కాదా…ఈ పాలకులు తీరు కాదా..
*ఓ ప్రజాస్వామ్యమా ఏమిటే ఈ ప్రాణాలతో చెలగాటం…
*అధికారం కోసం ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలో..
*ఏమిటీ దౌర్భాగ్యం…ఎందుకింత దుర్మార్గం…
(రామమోహన్ రెడ్డి)


ప్రజలు,ప్రజాస్వామ్యం పాలకులు , పాలించే ప్రభుత్వం,ప్రభుత్వ పథకాలు,పేద ప్రజల సంక్షేమం, పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు,లక్షల కోట్ల పెట్టుబడులు వేలకోట్ల ఉద్యోగాలు ,నిరుపేదలు లేని రాష్ట్రం,నిరుద్యోగం లేని సమాజం కోసమే రాజకీయ పార్టీల పోరాటం,ఆరాటం అంతిమంగా అన్ని రంగాలు అభివృద్ధి చెంది అత్యుత్తమ ఫలితాలు అందరికీ అందేలా చూడడమే ప్రథమ కర్తవ్యం.అందుకోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నామని చెప్పడం. అధికారం ఉన్నప్పుడు ఒకలా అది పోతే ఇంకోలా నరం లేని నాలుక ఎటు పడితే అలా మాట్లాడడం మళ్ళీ ప్రజాస్వామ్యం మంటూ పోసుపోనీ కబుర్లు చెప్పడం పరిపాటిగా మారిన ఈ స్వతంత్ర భారతావనిలో పేదవాడు పెదవానిగానే ఉంటున్నాడు…పెద్ద వాడు మరింత పెద్దవాడు అవుతూనే ఉన్నాడు.ఇది ఈ దేశ ,రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రజాస్వామ్యం, పాలకులు పాలించే తీరు,ప్రజలు పొందుతున్న పలితాలు. వెరసి పుటుక్కున పోతున్న ప్రాణాలు.ఇది ప్రస్తుతం నిత్యం జరుగుతున్న తంతు. ఎలా, ఎందుకు,ఏమిటీ ఇలా జరుగుతుందని ఆలోచిస్తే ప్రజాస్వామ్యం పక్కున నవ్వుతూ ముక్కున వేలేసుకోక తప్పదన్న వాదం వినిపిస్తోంది.
ఎందుకయ్యా ఇలా చెప్పాల్సిన పరిస్థితి దాపురించిందంటే ప్రజల కోసం పనిచేసే ప్రభువులు తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని చెప్పాలి.ఇలాంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ఓ నిండు ప్రాణం పోయింది.మరో ప్రాణం పోతుందని కొట్టుకుంటుంది ఇందులో ఒకరిది తన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. మరొకరిది తెలిసి కూడా అలా ప్రవర్తించడం అన్నది సరైన పద్దతి కాదనేది యదార్థం.కానీ ఇవన్నీ కూడా సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.ఇలా జరగడం అన్నది కూడా ఈ స్వతంత్ర భారతావనిలోనే.ఏ దేశం లో కూడా ఇలాంటి పరిస్థితి దాపురించిన ఉదంతాలు లేవని ఉన్నా కూడా అతి తక్కువ అది కూడా తమ జాతి ప్రయోజనాల కోసమే అన్నది జగమెరిగిన సత్యం.
ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే ఆదివారం విజయవాడ గాంధీ చౌక్ వద్ద జరుగుతున్న గ్రామ వార్డు సచివాలయా ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని క్రమబద్ధీకరణ చేసేందుకు తమ విధులలో బాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ రూరల్ నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అలీ అక్కడికి చేరుకుని నిరసన కారులను అదుపు చేసే క్రమంలో విధి ఆడిన వింత నాటకం లో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పలితం లేకపోయింది.అంటే ఇక్కడ ఆయన మరణం యాదృచ్చికం అనుకోవాలా నిరసన కారులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాట అనుకోవాలా అనేది కూడా ఆలోచించ తగ్గ విషయమే. యాదృచ్చికం అనుకుంటే నిర్మానుష ప్రదేశం లో జరిగినది కాదు.ఒక వేళ ఆందోళన కారులే కారణమా అని నిందించ లేని పరిస్థితి.కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ అలీ మరణం గుండె పోటు.గుండె విపరీతైన ఒత్తిడి కి గురయ్యితేనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అయితే ఇక్కడ ఉద్యోగులు వారి హక్కుల కోసం ఆరాటంతో నిరసన ,ఆ నిరసన కార్యక్రమాన్ని క్రమబద్ధీకరణ చేసేందుకు పోలీసులు వారిని అదుపు చేయడం ఇదంతా శాంతియుత వాతావరణం కాదుగా.కాబట్టి ఇందులో ఎవరి ప్రమేయం లేకుండానే సహజంగానే ఇరువురు వ్యక్తుల మధ్య తోపులాట జరిగినప్పుడు ఒకరిపై మరొకరికి ఒత్తిడి పెరుగుతుంది.సాధారణంగా నే ఇటీవల కాలంలో ఖాకీలకు కంటి మీద నిద్ర లేని రాత్రులు ఉన్నాయి.వాటితో పాటు ఎన్నో సవాళ్లతో కూడుకున్న కేసులు ఉన్నాయి.వెరసి శ్రమ,ఒత్తిడి,అలసట చెంది తీరిక లేకుండా ఇలాంటి ఉద్యమ కారులను అదుపు చేయడం లో తెలియని అపశృతి చోటుచేసుకున్న ఊపిరి ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు.ఇక గత రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్ మృతికి కూడా ఉద్యమమే అన్న పరోక్ష ఆరోపణలు వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.డిఎస్సీ ఎంపిక లో శాప్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమం లో వైసీపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడం చూసాం. అయితే ఆ కార్యక్రమం లో దివంగత కాకుమాను రాజశేఖర్ రెండు మూడు సార్లు అక్కడ జరిగిన తోపులాటలో కింద పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఇవన్నీ కూడా ఒకరికొకరు కావాలనే చేసుకున్న పనులు కాకపోయినా అధికార ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ఉనికి కోసం ఏ పార్టీ అయినప్పటికీ అధికారంలో ఉండే ప్రతిపక్షం పై బురద జల్లడం,అదే ప్రతిపక్షం అధికారం లోకి వస్తూనే అప్పటి వరకు అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షం లో ఉండి బురద జల్లుతూ ప్రజలను రెచ్చగొట్టడం అనేది నేటి రాజకీయ నాయకులకు ఒక విధానపరమైన అంశంగా ఎంచుకున్న మాట వాస్తవమే.ఇలాంటి పరిస్థితులలో నాడు నేడు సంఘర్షణకు లోనయ్యేది అటు అధికార యంత్రాంగం ఇటు ప్రజలే అన్నది యదార్థం.కానీ ప్రజలు ఆశా పరులు,బలహీనులు కాబట్టి ప్రభుత్వం అన్న ముసుగులో రాజకీయ నాయకులు ఆడే క్రీడలో బలిపశువులు కాక తప్పడం లేదు.
ఇలా పోతే ఈ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొని అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చేరిన న్యాయవాది రజనీ విషయం లో ఒకింత ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కారణం ఆమె ఈ ఉద్యమ కార్యక్రమంకు ముందే గుండె కి సంబంధించినవి చికిత్స చేయించుకున్నట్లు ఆమె చెప్పుకొస్తుంది.మరి అలాంటి సందర్భంలో ఆమె ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఇలాంటి ఉద్యమంలో పాల్గొనడం ఆమె ఆరోగ్య రీత్యా అంత మంచిది కాదన్నది తెలిసిందే. అయితే ఇక్కడ పోలీసుల తీరును తప్పు బట్టడం కూడా కత్తి మీద సాము లాంటిదే.వారి ఉద్యోగాలు కూడా ముళ్ళ కంప మీద నడిచినట్లే అన్న ధోరణి కూడా వ్యక్తం అవుతోంది అయితే ఇక్కడ ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు.ఎవరు అనారోగ్యం గా ఉన్నారనే విషయాలు వాస్తవానికి ఇరువురికి తెలియని విషయం.ఇలాంటి పరిస్థితులలో జరిగిన సంఘటన,జరుగుతున్న సంఘటన పట్ల సమాజం నుంచి నిరసన తెలిపే హక్కు లేదని చెప్పలేం. అదే తరుణంలో అనుకోని ఇలాంటి సంఘటనల వల్ల అనర్థాలు జరిగితే వాటికి బాధ్యత వహించేవారు ఎవరూ అన్న ప్రశ్న ఎందుకు తమకు తామే వేసుకోలేక పోతున్నారు విజ్ఞులైన వారు అన్నది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ.


. ఇక ప్రభుత్వాల పాత్ర ఏమిటీ అన్నది ఆలోచన చేస్తే అది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని చెప్పాలి. కారణం గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే సాధ్యం అవుతుందని 2019 అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయాల రూపకల్పన చేసి ఒక లక్షా ముప్పై వేల మంది పై చిలుకు ఉద్యోగాలను రూపకల్పన చేసి ఊరూర గ్రామ సచివాలయాలు నిర్మాణం చేపట్టడం జరిగింది.మరి ఆయన అదృష్టమో దురదృష్టమో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉండి దాదాపు రెండు సంవత్సరాలు పాలన అస్తవ్యస్తంగా నడవడం ,జనజీవనం కూడా స్తంభించి పోవడం అందరికీ విధితమే.అదే విపత్తు లేకుండా పోయి ఉంటే జగన్ మోహన్ రెడ్డి పాలన లో ఏమి జరిగి ఉండేదో పూర్తిగా తెలిసేది. ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే ఏ ప్రభుత్వమైన. ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమం ప్రజల జీవితాలలో ముడిపడి ఉన్నప్పుడు భవిష్యత్ దృష్ట్యా అన్ని రకాల చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారనేది ప్రశ్న. అంటే సమాజం లో మన రాజ్యాంగం ఇచ్చిన అమితమైన స్వేచ్స అన్నది కొందరికి వరం అవుతుంటే మరికొందరికి శాపంగా మారిందనేది వాస్తవం.ఒక అక్షరాస్యుడికి ఉద్యోగం రానంత వరకు రాలేదని నిందలు వేయడం, రోడ్డెక్కడం వచ్చాక పని ఒత్తిడి,జీతం సరిపోవడం లేదని అదే రోడ్డెక్కడం చూస్తూనే ఉన్నాం.అప్పుడు ఇప్పుడూ రోడ్డెక్కడం అన్నది సర్వ సాధారణం అవ్వడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ చేసుకున్న అదృష్టమని భావించక తప్పదు. కాదంటే జరిగే అపార్ధాలు,అనర్థాలు వేరుగా ఉంటాయన్నది లోకోత్తర ధర్మం.
మరి ఇలాంటి పరిస్థితులలో ప్రజల కోసం,ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసి ఈ రాష్ట్రం సుబీక్షంగా ఉండేలా చేయడం అన్నది సాధ్యం కాదా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మేధావి వర్గాలు. అన్ని సక్రమంగా జరిగి అమలు జరుగుతున్న ఉద్యోగులే తమకు ఇంకా వసతులు సౌకర్యాలు కల్పించాలని పోరాటం చేసి ఒప్పుకుంటే పాలాభిషేకం, ఒప్పుకోక పోతే తైలాభిషేకం చేస్తున్న విషయం తెలిసిందే అయినా ఒక ప్రభుత్వం చేసిన పనుల్లో లోపాలు ఉంటే తరువాత ప్రభుత్వం వాటిని సరిదిద్ది చేయడం లో నిర్లక్ష్యం వహించడం మూలాన ఉద్యమాలతో రోడ్డెక్కి అలజడులు లేపడం వలన అనుకోని సంఘటనల వల్ల నిష్కారణంగా నిండు నూరేళ్లు నిండక ముందే ఈ లోకం నుంచి నిష్క్రమణ చెందుతూ ఉన్నారనే ఆవేదన,ఆందోళన యావత్ ప్రజానీకం నుండి బహిర్గతం అవుతుంది ఇప్పటికైనా ప్రజలను పాలించే ప్రభువులు వీలయితే ప్రజలను రక్షించక పోయినా పర్వాలేదు కానీ ఇలా భక్షించే విధానాలు వద్దని చేతులెత్తి మొక్కుతోంది మానవ సమాజం.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article