Uncategorizedతూ మీ బ్రతుకులు చెడ..!

తూ మీ బ్రతుకులు చెడ..!

*ఇవేమి రాజకీయాలు.
*.ఎవరికోసం…ఎందుకోసం ఇలా…
*రక్త సంబంధాలలో కూడా రాజకీయాల…?
*కన్న పేగును కూడా కట్టడి చేస్తారా…
*ఈ తప్పు ఎవరిది…నాయకులదా… అధినాయకత్వందా…
*వేదాలు ఏమి చెబుతున్నాయి…
*చరిత్ర నేర్పిన గుణపాఠం ఏమిటీ…
*మనిషి మరణాన్ని కూడా మీకోసం వాడుకొంటారా…
*కుటుంబ కలహాలను ప్రోత్సహించిందెవరు…
*నీతులు చెప్పడానికేనా ..ఆచరణ లేదా…
*ఎవడు ఎప్పుడు నేర్పాడురా ఈ విష సంస్కృతి…
*మీతోనే ప్రజా స్వామ్యం..ప్రజా సంక్షేమం…
*బుద్దిలేనిది ప్రజలకా… పాలించే ప్రభువులకా…
*ఓ నీతి లేని మానవ…మానవత్వం ఏదిరా….
*ఓ మనిషి మార్పు చెందురా…
(రామమోహన్ రెడ్డి)

మానవ సమాజానికి కుటుంబ వ్యవస్థ పునాది. వివాహం, రక్త సంబంధం లేదా దత్తత ద్వారా ఏర్పడే వ్యక్తుల సమూహాన్ని కుటుంబం అంటారు. ఇది సమాజంలో సభ్యులకు భావోద్వేగ భద్రతను, సంస్కృతిని మరియు రక్షణను అందిస్తుంది. భారతదేశంలో ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న వ్యవస్థ.
తల్లిదండ్రులు దైవంతో సమానం. మనకు జన్మనిచ్చి, ప్రాణంగా చూసుకునే అమ్మ, అడుగడుగునా దారి చూపే నాన్న ఈ ప్రపంచంలో మనకు దొరికిన అత్యంత గొప్ప వరం. వారి స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు.
తల్లిదండ్రులకు ఆడపిల్ల పుడితే ఆ కుటుంబంలో కూతురు ఒక వెలుగు లాంటిది. ఆమె తల్లిదండ్రులకు మంచి స్నేహితురాలు, ఆపదలో ధైర్యం.
కొడుకుతో సమానంగా కూతురు కూడా తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది.నేటి సమాజంలో ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుతూ, అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. కుటుంబానికి ప్రేమను, సంతోషాన్ని పంచడంలో కూతురు ముందుంటుంది.

ఇతరుల ప్రయోజనాలను, భావాలను పట్టించుకోకుండా కేవలం తన స్వంత లాభం, సుఖం లేదా ఆనందం కోసం మాత్రమే ఆలోచించడాన్ని స్వార్థం అంటారు. ఇది పరోపకారం లేదా నిస్వార్థతకు పూర్తిగా విరుద్ధమైనది. పరిమితిలో ఉంటే ఆత్మరక్షణకు అవసరం, కానీ హద్దులు దాటితే సమాజంలో అశాంతికి, బంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది.
పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. హిందూ పురాణాలలో అమృతం సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు. మరికొంతమంది చిరంజీవులుగా పేర్కొనబడ్డారు.వారిని చూసామని,ఉన్నారని నిజ నిర్దారణ చేసిన వారు ప్రస్తుతం లేరనేసి సత్యం.
చావు పుట్టుకలు అనేవి ప్రకృతి నియమం మరియు సృష్టి యొక్క చక్రం. “పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు” (జాతస్య మరణం ధ్రువం) అనేది సనాతన ధర్మం, భగవద్గీత వంటి గ్రంథాలలో చెప్పబడిన పరమ సత్యం. మనిషి జీవితంలో పుట్టుక ఒక ఆరంభమైతే, చావు అనేది అంతం కాదు.. ఆత్మ ప్రయాణంలో ఒక భాగమని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి.
ఈ ఉపోద్ఘాతం ఎందుకయ్యా అని అనుకోవచ్చు కొంతమంది అపర మేధావులు.ఈ భూమి మీద పుట్టిన చరా చర జీవ రాశులలో అన్నింటి లో ఉత్తమ జన్మ మానవ జన్మ అని పురాణాలు చెబుతున్నాయి .అసలు భూమిపై మనిషి పుట్టుక అనేది వందల కోట్ల సంవత్సరాల జీవ పరిణామ క్రమంలో ఒక భాగం. దాదాపు 350 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో ప్రాణం మొదలైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల ద్వారా ఆదిమానవుడు ఆవిర్భవించి, లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఆధునిక మానవుడు ఉద్భవించాడని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీని ఆధారంగా మనిషి పుట్టుక ప్రారంభంలో కులం,మతం, జాతీ వంటి విభేదాలు ఎక్కడ కూడా లేవని చెప్పాలి.కోతి నుండి ఆదిమానవునిగా రూపాంతరము చెందినప్పుడు ఈ బేధాలు ఎక్కడ కూడా చెప్పబడలేదనేది సత్యం.ఆ తరువాత పరిణామ క్రమంలో మనిషి లో మార్పు మొదలై ఈ ఔహిక ప్రపంచంలో కి వచ్చాక అన్ని రకాల భేదాభిప్రాయాలు పుట్టుక రావడం జరిగిందనేది యాదార్థం. ఇలా మారుతున్న కాలాన్ని అనుసరించి మనిషి స్వార్థం వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు.ఆ స్వార్థం ప్రేగు బంధాలను సైతం తెంపి వేసే స్థాయికి చేరుకున్నాయంటే నేటి మన పాలకుల తీరని చెప్పక తప్పదు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోవడం అత్యంత అమాననీయమని చెప్పాలి. నేడు కాపు ఉద్యమనేత మాజీమంత్రి సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్భనాభం మరణాంతర పరిణామాలు చూస్తుంటే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.ముద్రగడ పద్మనాభం (అధికారిక గెజెట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి; 1953 జనవరి 22 – 2026 జూలై 14) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు. ఆ తరువాత 2024 సార్వత్రిక ఎన్నికలు సమయంలో 2024 మార్చి 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో చేరాడు.


వైసీపీ పార్టీ లో చేరిన తరువాత ఆయన పై వచ్చిన విమర్శలకు తలోగ్గకుండా కావు నేత ఆయిన ప్పటికి పద్భనాభ రెడ్డి గా గెజిట్ మార్పు చేసుకుని వైసీపీ లోనే కొనసాగుతూ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. బుధవారం ఆయన స్వగ్రామం లో అంత్యక్రియలు అధికార లాంచానాలతో పూర్తి అయ్యాయి.
ఇదంతా ఒక గోప్ప వ్యక్తి కి జరిగే అంతిమ సంస్కారం.ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన మరణాంతరం తరువాత జరిగిన పరిణామాలు చూస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం రక్త సంబంధాలను కూడా మలినం చేస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులను ,ఈ రాజకీయ నాయకుల ముసుగులో పార్టీలు నడిపే నాయకత్వాన్ని చూసి భరతమాత ప్రసవ వేదన పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నికలు ,ప్రజాస్వామ్య వ్యవస్థ, అధికారులు తీరు చూసి విసిగి వేశారిపోయిన ప్రజలు ఒక నాటి ఆంగ్లేయులు పాలనను గుర్తుకు తెచ్చుకుంటారని స్వాతంత్య్ర ము రాక మునుపే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పిన విదంగా నేటి రాజకీయ నాయకుల తీరు ఉందని గంటా పధంగా చెప్పచ్చు. భరత మాత గడ్డపై కాలు మ్రోపిన పరాయి దేశస్తులు ఈ దేశ సంపదను దోచుకుని పోతే మన పాలకులు వారి సంపాదన కోసం యావత్ భారతావనిని దోచుకోవడం లో తేడాలు వస్తున్న నేపధ్యంలో ప్రేగు బంధాన్ని కూడా అవహేళన చేస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలుగు ప్రజలకు ఐద
దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న విధ్వంసం రాష్ట్ర విభజన తర్వాత అధికార దాహం కోసం ప్రజలిచ్చే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పనంగా దోచుకున్న సొమ్ము దాచుకోవడం లో వస్తున్న వచ్చిన తేడాల కోసం రాత్రికి రాత్రే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నిస్సిగ్గుగా రక్త సంబందాలను నడి బజారులో నవ్వుల పాలు చేస్తుంటే నేటి ప్రజానీకం నవ్వుకుంటూ ఉండి పోతుంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతర పరిణామాలు ఆ కుటుంబ పరువు ఓకే గర్భాన జన్మించిన అన్నా చెల్లికి డబ్బులో తేడాలు వచ్చి రోడ్డెక్కారు.ఇక తెలంగాణ లో ఉనికె లేని స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన తెలంగాణ లో ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉంటే ఆయన పాలనలో అధికారం డబ్బు అన్ని సంపాదించి లిక్కర్ కేసులో జైలుకూడు తిని బైటికి వచ్చి తండ్రి అన్నపై దుమ్మెత్తి పోస్తోంది అక్క కవితక్క.ఇక ఆంధ్రలో అటు కుల బలం రాజకీయ బలం ఉన్న కాపు నాయకుడిని కులం మార్చుకునెంత స్థాయికి దిగజార్చి వేశారు ఈ నాయకులు. అది చాలక ముద్రగడ కూతురిని జనసేన లోకి తీసుకుని తండ్రిపై రాజకీయ విమర్శలకు ఎక్కుబెట్టారు.మొదట షర్మిలక్క, తరువాత కవితక్క,ఇటు క్రాంతక్క ఇలా రక్త సబంధాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే పాలకులతో ప్రజా సంక్షేమం, ప్రజా సేవ అన్నవి పెద్ద బూతు పదాలని ఎందుకు అనకూడదో ఈ నాయకులు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తండ్రి చివరి చూపు కు కూడా నోచుకోలేని స్థాయికి తెచ్చింది నేటి ఈ నాయకులు కాదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ఇది ఉందా అని ప్రజల్లో నుంచి విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులలో మనుషుల జీవన ప్రమాణాలు ఏ విదంగా మెరుగు పడతాయో అన్నది వేచి చూడక తప్పని పరిస్థితి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article