*ఓ మధు..ఓ మధు ఆ ఎనిమిదేళ్లు ఏమైపోయాయ్..?
*ఇదేమో నీకెంతో హయ్..పీఆర్ కేమో బరువాయే..
*జీవో ఒకటే..రాతలు అనేకం…
*మాతృ శాఖకు తిరిగి తీసుకోమని అన్నారు..
*ఏపీలో సీఐ ఈ పోస్ట్ లేదని అన్నారు…
*మళ్లీ సీఐ ఈ పోస్ట్ క్రియేట్ చేయాలని జీవో ఇచ్చారు..
*మళ్లీ జీవో1319 ప్రకారం 2016 నుంచి సీఐ ఈ గా పరిగణలోకి అంటున్నారు..
*2008 నుంచి ఉన్న సీఐ ఆ సర్వీస్ ఏమైనది…!
*ఆ ఎనిమిదేళ్లలో పొందిన లబ్ది ఎలా పరిగణనిస్తారు…?
*రాష్ట్ర విభజన లో డైరెక్టర్, సిఐ ఈ తెలంగాణా కు కేటాయిస్తే…
*ఏపీలో సీఐ ఈ పోస్ట్ ఎలా వచ్చింది…?
*విభజన చట్టంలో ఏముంది…!
*ఏపీ జిఎడి ఐ అండ్ పీఆర్ సీఐ ఈ పోస్ట్ ఇవ్వాలని సిఫార్సు చేసిందెవరు…
*ఇది లోప భూయిష్టమా.. లేక వారి ఇష్టమేనా…?
*అసలు ఎవరిది త్యాగం…ఎవరిది స్వార్థం..?
*నాడు లేని పోటీ నేడేందుకు వస్తోంది..
*80 శాతం ఉన్న పీఆర్ వింగ్ తో 20 శాతం ఉన్న ఇంజినీరింగ్ పోటీ సబబేనా…?
*సమాచార శాఖ మంత్రి సమన్యాయం పాటిస్తున్నారా…!
*ప్రభుత్వాలు ఇంత అచేతనంగా ఉన్నాయా…?
*సమాచార శాఖకు చెదలు పట్టిందా ..!
*పీఆర్ కు జీవోలే అండ..ఓ మధు కు ఎవరెవరో అండ దండ..?
(రామమోహన్ రెడ్డి)
సమాచార శాఖలో పీఆర్ వింగ్ వర్సస్ ఇంజినీరింగ్ మధ్య జరుగుతున్న నాటకీయ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వాలు ఇంత అచేతనంగా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనకు మూలమైన అన్ని ప్రధాన శాఖలను సమన్యయ పరుచుకుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను చేరవేసే కీలకమైన శాఖలో ఇన్ని రకాల లుక లుకలుకలున్నాయని బహిర్గతం అవుతుంటే ఆహా ఇది కదా ప్రభుత్వాల తీరు అన్న చర్చకు దారి తీస్తోంది. కారణం రాష్ట్ర విభజన జరిగిన 16 సంవత్సరాల తరువాత పదవుల పందేరంలో ఓకే శాఖలో ఉన్న పీఆర్ వింగ్ ఇంజినీరింగ్ వింగ్ వారు తమ ఆధిపత్యం కోసం పడుతున్న పాట్లు చూస్తుంటే ఇదేమి ప్రజాస్వామ్య వ్యవస్థ అన్న మీమాంసకు ప్రజలు వచ్చేస్తున్నారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అసలు నేడు ఈ రెండు విభాగాల్లో ఏర్పడిన ఏర్పడుతున్న వివాదాస్పద అంశంకు
అసలు కారణంఎవరు ప్రభుత్వ జీవో లలో ఉన్నదేమిటీ రాష్ట్ర విభజన తర్వాత నేడు పీఆర్ వింగ్ తమ అస్తిస్త్వం కోల్పోయే పరిస్థితి వస్తుందని ఎందుకు ఆందోళన, ఆవేదన చెందుతుంది . ఇంజినీరింగ్ వి విభాగం వల్ల జరుగుతున్న నష్టం ఏమిటే ఇలా అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తడం వెనుక దాగి ఉన్న వాస్తవం ఏమిటా అనే వివరాల్లోకి వెళితే…సంభ్రమాచ్ఛార్యానికి గురిచేస్తున్నాయి ప్రభుత్వ విధానాలు.
సమాచార శాఖ ఏర్పడిన తరువాత కాలంలో మాతృక 1969 మరియు 1992 వ సంవత్సరం జూన్ ఐదవ తేదీన జీవో 261 ప్రకారం పీఆర్ ఇంజినీరింగ్ విభాగాల క్యాటగిరిలు ఏర్పచడం జరిగింది.ఈ జీవో ప్రకారం పీఆర్ వింగ్ నుంచిమొదటి క్యాటగిరి లో డైరెక్టర్, రెండవ క్యాటగిరి జయింట్ డైరెక్టర్, మూడవ క్యాటగిరి నాటి రేడియో ఇంజినీర్ నేటి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్,నాల్గవ క్యాటగిరి కింద పీఆర్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్, ఐదవ క్యాటగిరి కింద రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ అంటే ఆసలైన రేడియో ఇంజినీర్,అరవ క్యాటగిరి కింద డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్,ఏడవ క్యాటగిరి అసిస్టెంట్ డైరెక్టర్, ఎనిమిదోవ క్యాటగిరి కింద ఎడిటర్ పీఆర్ వింగ్,తొమ్మిదోవ క్యాటగిరి కింద డిపిఆర్వో లుగా క్యాటగిరి లు చేశారు.అయితే అప్పుడు అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ అనేది పుట్టలేదు.ఆ ఆలోచన అప్పట్లో చేయలేదు.
ఆ తరువాత మాతృక జీవో 1969 మరియు 1992 వ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన అడిషనల్ డైరెక్టర్ పదవి ని క్రియేట్ చేయడం కోసం జీవో 473ను విడుదల చేసారు. ఈ జీవో ప్రకారం పీఆర్ వింగ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ జాయింట్ డైరెక్టర్ పబ్లిసిటీ సెల్ విభాగం, మరో జాయింట్ డైరెక్టర్ ప్రెస్ విభాగం నుంచి తమ జాయింట్ డైరెక్టర్ హోదాలు ఇక వద్దని ప్రభుత్వానికి సరెండర్ చేయడం వలన అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ క్రియేట్ అవ్వడం జరిగింది.ఇక్కడ పీఆర్ వింగ్ వారే తమ రెండు పదోన్నతులను వదులుకోవడం జరిగిందని చెప్పాలి.ఇంజినీరింగ్ విభాగం వారి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదని చెప్పాలి.
ఏదయితే 473 జీవో విడుదల అయ్యిందో దానికి అనుసంధానంగా జీవో 557 ద్వారా అడిషనల్ డైరెక్టర్ పోస్టులోకి పదోన్నతుల క్రమానికి మార్గదర్శకాలు చేసింది.సీనియర్ జాయింట్ డైరెక్టర్ అప్గ్రేడ్ ద్వారా అడిషనల్ డైరెక్టర్ అవ్వచ్చు అన్న స్పష్టత ఇవ్వడం జరిగింది.ఇక్కడ కూడా ఇంజినీరింగ్ విభాగం ప్రస్తావన ఎక్కడా చూపలేదు.ఆ తరవాత ఇంజినీరింగ్ విభాగం సవరణ అంటే “Method of Apointment” ద్వారా తమ విభాగం కూడా క్యాటగిరీ 1A పరిగణనలోకి తీసుకోవాలని కోరి జీవో 542 సాధించి తమ ఉనికిని చాటుకున్నారు .అయితే సదరు జీవో మరొక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. అడిషనల్ డైరెక్టర్ అయ్యేవారికి జర్నలిజం ఉండాలని.ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు ఏదయిన డిగ్రీ తో పాటు జర్నలిజం ఉంటేనే డిపిఆర్వో ఉద్యోగంలో చేరాలని ఉంది.ఇక్కడ ఇంజినీరింగ్ విభాగంలో జర్నలిజం అనేది లేదు.ఈ సవరణ ప్రకారం క్యాటగిరి-3 కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్ రావడం జరిగింది.ఆ తరువాత 1993 వ సంవత్సరం అక్టోబర్ 14న జీవో 541 ప్రకారం రేడియో ఇంజినీర్ నుంచి రూపాంతరం చెంది చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా మార్చుకున్నారు.
ఆ తరువాత పరిణామ క్రమంలో 1996 సెప్టెంబర్ తొమ్మిదోవ తేదీన జీవో 397 ప్రకారం రేడియో ఇంజినీర్ ను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక అసలు కథ ఇప్పుడే అచ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి.ఎలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీఆర్ ,ఇంజినీరింగ్ విభాగంలో ఎలాంటి అలమరికలు లేకుండా సాగింది. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ మధు సూధన ప్రస్తానం పై చర్చ కు దారితీస్తుంది. ఎలా అంటే 2008 లోనే ఓ మధుసూదన చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా బాధ్యతలు స్వీకరించారు.అయితే ఆయన మాతృ శాఖలో కాకుండా డిప్యుటేషన్ పై అనేక శాఖలలో పనిచేయడం జరిగింది. అయితే 2016 లో సెర్ప్ నుంచి ఓ మధుసూధన తన మాతృ శాఖకు వస్తున్న సందర్భంలో సమాచార శాఖ లో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా ఉన్న ఓ మధు డిప్యుటేషన్ అయ్యాక సెర్ప్ నుంచి రిలీవ్ అయ్యి తిరిగి ఐ అండ్ పీఆర్ అంటే మాతృ శాఖకు వచ్చే క్రమంలో 2016 వ సంవత్సరం అక్టోబర్ 31 వ తేదీన జీవో 212 ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం నేరుగా సీఐ ఈ పోస్ట్ ఇవ్వడం కుదరదని ఉద్యోగం కోసం వేచిచూస్తున్న ధోరణిని చూపించ్ డానికి కొన్ని నెలలు తన ఉద్యోగం కల్పించాలనే నాటకీయ పరిణామాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి.అయితే ఈ జీవో లోనే అనేక రకాల ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాల్సి వస్తుంది. ఏమిటయ్యా అంటే అప్పటికే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ క్యాడర్ లో సెర్ప్ లో డిప్యుటేష్ లో ఉన్న ఓ మధు ను తిరిగి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా తీసుకోవాలని అయితే ఆ పోస్ట్ విభజన చట్టం ప్రకారం డైరెక్టర్ పోస్ట్ తో పాటు సీఐ ఈ ను కుడా తెలంగాణ కు కేటాయించడం జరిగింది కాబట్టి ఏపీ లో సీఐ ఈ ని తీసుకోవడం కుదరని అందుకోసం కొత్త సీఐ ఈ పోస్ట్ క్రియేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖలో ఉన్న ఐ అండ్ పీఆర్ ఓ మధు కోసం ఫైల్ నడిపించి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది.ఇందులో నాటి పరిపాలన విభాగంలో ఉన్న కీలక అధికారులు ఓ మధు తో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యము కారణంగా మూలంగా 2016 కామన్ సీనియారిటీ ప్రకారం ఓ మధు సీనియర్ గా ఉన్నానని తననే అడిషనల్ డైరెక్టర్ గా ఇవ్వాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచి నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది.
అయితే ఇక్కడే భిన్నమైన వాదనలు,అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పీఆర్ వింగ్ వారు. జీవో 212 నే ఎంత లోపభూయిస్టంగా ఉందని అందులో మూడు రకాల ప్రశ్నలు ,సమాదానాలు వ్యక్తపరిచారు.సెర్ప్ నుంచి మాతృ శాఖకు బదిలీ చేస్తున్నప్పుటీకే ఓ మధు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ హోదా వ్యక్తపరుస్తూ ఆ పోస్ట్ తెలంగాణ కు కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ అంటే ఏపీ లో లేదంటూ కొత్త సీఐ ఈ పోస్ట్ క్రియేట్ చేసారన్నది పీఆర్ వింగ్ వాదనకు సంబంధిత జీవో నే ప్రామానికంగా నిలిస్తుంది.2016 లోనే సీఐ ఈ గా ఓ మధు సినియారిటీ ని డిక్లర్ చేస్తూ ఈ నెల 3వ తేదీన జీవో 1319 ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
అలాంటప్పుడు 2008 నుంచి 2016వరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా పొందిన వేతనాలు, ఇతర అలవెన్స్ లు, ప్రభుత్వం నుండి పొందిన లబ్ది ఇవన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారా లేక ప్రభుత్వమే రికవరీ చేస్తుందా అన్న ప్రశ్న నేడు ఉత్పన్నమవుతోంది.అలాగే 2016 సిఐ ఈ గా లో ఉన్నప్పుడు మళ్లీ సీఐ ఈ గా పోస్ట్ కావాలని అడగడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటీ.ఏపీ లో లేని సీఐ ఈ పోస్ట్ తో తిరిగి రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా రివర్సన్ ఎందుకు చేయలేదనే భిన్నమైన వాదనలు కూడా కూడా ఉన్నాయి. దీనితో పాటు పూర్వపు తేదీ అమలు అంటే 2008 నుంచి అడిగిన సీనియారిటీ చెల్లదని ప్రభుత్వం తిరస్కరించిన నేపధ్యంలో 2016 నుంచి సీనియారిటీ కోరడం చక చకా మధు ఫైల్ పై సమాచార శాఖా మంత్రి, సంబంధిత అధికారులు సంతకాలు చేసారన్నది తెలుస్తోంది. అయితే ప్రభుత్వం 2008 సీనియారిటీ ని ఎందుకు వద్దని తిరస్కరణ చేసింది అన్నది కూడా సంబంధిత అధికారులు కానీ మంత్రి కార్యాలయం ఎందుకు పునః పరిశీలన చేయలేదనే వాదం కూడా బహిర్గతమవుతోంది. అలాగే 2008 నుంచి 2016 వరకు అనేక ఇతర డిపార్ట్ మెంట్ లలోనే డిప్యుటేషన్ పై నే ఉండడం జరిగిందని కారణం ఇక్కడ సిఐ ఈ పోస్ట్ లేక పోతే రివర్సన్ లో రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ వెళ్ళాల్సి వస్తుందనే అభియోగాలు కూడా ఉన్నాయి.ఇవన్నీ వదిలి
పీఆర్ వింగ్ త్యాగం చేసిన రెండు జేడీ పోస్ట్ ల వల్ల అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ వస్తే ఆ పోస్ట్ సంబంధిత మంత్రి అండదండ ఇతర సామాజిక వర్గ సమీకరణాలు తోడై ఇంజినీరింగ్ విభాగం ఇస్తే 34 సంవత్సరాలుగా పీఆర్ వింగ్ లో ఎంతో పదోన్నతులు కోల్పోయి ఇప్పుడు ఎటు వంటి పోస్ట్ లు సరెండర్ చేయని ఇంజినీరింగ్ వారికి ఈ ప్రబుత్వం ప్రాధాన్యత ఇస్తామంటే తమ అస్తిస్త్వం కోల్పోవాల్సి వస్తుందని అలాంటప్పుడు తమ అస్తిస్త్వం కోల్పోయే సమస్యే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పీఆర్ వింగ్ నుంచి.80 శాతం ఉన్నపిఆర్ వింగ్ విభాగం, త్యాగాన్ని కూడా విస్మరించి 20 శాతం ఉండి ఏ పోస్ట్ వదులుకోలేని ఇంజినీరింగ్ విభాగంకు సమర్థిస్తే పీఆర్ వింగ్ నుంచి ప్రభుత్వానికి నిరసన సెగ తగిలే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోంది. మరి ప్రభుత్వం ఈ నెల మూడవ తేదీన వెలు వర్చిన సీనియారిటీ పై పీఆర్ వింగ్ నుంచి అభ్యంతరాలను తీసుకుని పునఃపరిశీలన చేస్తుందా లేక సంబంధిత అధికారులు లోపభూయిష్టం, ఓ మధు కు ఉన్న సామాజిక రాజకీయ, ఇతర పలుకుబడి కి జై కొట్టి పీఆర్ వింగ్ నోట్లో మట్టి కొడతారా అన్న అనేక రకాల ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం ఏలాంటి నిర్ణయం ఎవరి వైపు తీసుకుంటారో అన్నది వేచిచూడక తప్పని పరిస్థితి.

