కూటమి ప్రభుత్వంలోను ఆగని అక్రమ రవాణా
రేషన్ రైస్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేస్తామంటుంటే..
ఏలూరు జిల్లాలో అధికారులుకు పట్టని వైనం..
విజిలెన్స్ ఎస్పీనే వ్యాపారం చేసుకోమన్నాడటా
ఎస్పీని వివరణ కోరినా చర్యలు సూన్యం..
సివిల్ సప్లైడి.ఎస్.ఒ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో..
ఈ డాన్ల అంతం చూడాలంటే పవన్ కళ్యాణ్ రావాలేమో..
ఇతగాడి మామ మామూలోడు కాదట

ఏలూరు:
గత సంవత్సర కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏలూరు ఒకటవ పట్టణానికి చెందిన కసాయి అనే వ్యక్తి ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాల నుండి పేదవారికి చెందిన రేషన్ రైస్ ను అక్రమమార్గంలో ధనార్జనే ధ్యేయంగా కాకినాడ, మండపేట,ఈతకోట,నల్లజర్లకు సరఫరా చేస్తూ ప్రతి నెల 100 నుండి 200 టన్నులు వరకు ఎగుమతి చేస్తూ తనని ఎవరు ఏం చేయలేరంటూ ఇతగాడి మామ మామూలోడు కాదంటూ తన మామే అసలు పెద్ద డాన్ అంటూ ప్రగడ్బాలు పలుకుతుంటే అధికార యంత్రాంగం ఆదమరిచి ఉంటోందని అక్కడ ఇక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?గత 5నెలలు క్రితం అజ్ఞాతం నుండి వెలుగులోకి వచ్చిన ఈ కసాయి రైస్ డాన్ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?మా మామయ్య ఫ్రెండ్ అన్న చందాన ఆయన ఏలూరు విజిలెన్స్ ఎస్పీతో మాట్లాడి ఈ రైస్ వ్యాపారం చేసుకోమనట్లుగా చెప్పుకుంటూ తిరుగుతూ, ఎవరైనా రైస్ డంప్ చేసే ప్రాంతానికి వచ్చిన కన్నెత్తి చూసిన అంతు చూస్తా అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.పవన్ రావాలేమో?ఓ పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నా కూడా ఇక్కడ మాత్రం నో సీజ్ నో కేస్ అంటా? మరోవైపు నాదెండ్ల మనోహర్ ఈ అక్రమ రైస్ వ్యాపారం పై అలుపెరగని పోరాటం చేస్తుంటే అవేమి పట్టనట్లుగా ఇక్కడ పనిచేసే కొంతమంది అధికారుల తీరు వారికి అనుకూలంగా ఉందేమోనని అనుమానం కలగకమానదు. ఇటువంటి అక్రమ వ్యాపారస్తులు కోసం, పనిచేయని కొంతమంది అధికారుల కోసం సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నన్నెవరూ ఆపలేరు?*ప్రతి నెల ఒకటో తారీకు నుండి నచ్చినట్లుగా రేషన్ రైస్ అక్రమ వ్యాపారం చేస్తా ఎవరు ఆపుతారో చూస్తా?అంటున్న ఈ కసాయి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నెల ప్రారంభంలో ఇప్పుడే రేషన్ రైస్ పంపిణీ చేయడం మొదలైంది కనుక జిల్లా సివిల్ సప్లైఅధికారులు కట్టుదిట్టంగా నిఘా ఉంచి ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు పట్ల కఠినంగా వ్యవహరించి పేదవారికి చెందిన రేషన్ రైస్ పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.