తాజా వార్తలుసీఎం పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆదేశాలు

సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆదేశాలు

పోలవరం

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనగా 16వ తేదీన సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా చేయాలని అధికారులను ఆదేశించారు. నేడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
అనంతరం సీఎం పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. డ్యామ్ శిల్పి కాపర్ డాం , బ్యారేజీ లీకులు పగుళ్లు అన్ని పరిశీలించి, అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌, బారికేడింగ్‌, తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని, హెలీఫ్యాడ్‌ ప్రాంతంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి , కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్ ,జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ ,మండల అధ్యక్షులు గునపర్తి చిన్ని ,బుట్టాయిగూడెం మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు , వైస్ ప్రెసిడెంట్ తెలగంశెట్టి రాము , జనసేన నాయకులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article