Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఏం సాధించారని మీకు శాలువా కప్పాలి?: జగన్ కు మంత్రి గొట్టిపాటి ప్రశ్న

ఏం సాధించారని మీకు శాలువా కప్పాలి?: జగన్ కు మంత్రి గొట్టిపాటి ప్రశ్న

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారని మీకు శాలువా కప్పాలని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ వ్యవస్థను నాశనం చేసినందుకు మీకు శాలువా కప్పాలా? అని అన్నారు. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినందుకు శాలువా కప్పాలా? అని ప్రశ్నించారు. వ్యవస్థలను నాశనం చేసినందుకు శాలువా కప్పాలా? అని ఎద్దేవా చేశారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి సామ్రాట్ అని సన్మానం చేయాలా? అని ప్రశ్నించారు. విద్యుత్ వ్యవస్థపై రూ. లక్ష కోట్లు అప్పుచేశారని గొట్టిపాటి మండిపడ్డారు. జగన్ అవినీతి గతంలో రాష్ట్రం దాటితే… ఇప్పుడు ఏకంగా దేశం దాటిందని అన్నారు. జగన్ నిర్వాకంతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article