Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుభూసార పరీక్షతోనే భూమిని బంగారంగా మార్చగలము

భూసార పరీక్షతోనే భూమిని బంగారంగా మార్చగలము

ఏవో స్రవంతి

రామచంద్రపురం

భూసార పరీక్ష విధానంతోనే భూమిని బంగారంగా మార్చుకుని మనం పండించే పంటల్లో నుంచి అధిక ఆదాయం పొందగలరని రామచంద్రపురం మండలం వ్యవసాయ అధికారి శ్రీమతి స్రవంతి అన్నారు.
మండలం లో గత ఖరీఫ్ సీజన్ లో భూసార పరిరక్షణ పథకం(బంగారు నేల – బంగారు పంట)క్రింద 440 భూసార పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం లో భూసార పరీక్ష పత్రాలను రైతులకు ఆమె అందచేసారు. రైతులు కు భూసారా పరీక్షల వలన నత్రజని,భాస్వరం, పొటాషియం, జింక్, ఐరన్ మొదలగు వాటి లభ్యత తెలుస్తుంది అని వాటిని అనుసరించి రైతులు రబీ లో ఎరువులు ఎంత మోతాదు లో వేస్కోవచ్చునో ఒక అంచనాకు వచ్చి మంచి దిగుబడి పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article