Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుబీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు

బీహార్ రాష్ట్రంలో కల్తీసారా తాగి మరణించిన వారి సంఖ్య రోజురోజూ పెరుగుతుంది. శుక్రవారానికి ఈ సంఖ్య 32కు చేరుకుంది. మరికొంతమంది కల్తీసారా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఈ కల్తీసారా ఘటన కలకలం సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన బీహార్ రాష్ట్రంలోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో తొలుత 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు ఈ సంఖ్య 35కు చేరుకుంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సివాన్ జిల్లాలోనే మృతుల సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ 20 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అమితేష్ కుమార్ వెల్లడించారు. మరో 15 మంది వరకు పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. సారణ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పది మందికిపైగా చనిపోయినట్టు చాప్రా పట్టణం ఎస్పీ కుమార్ అషిశ్ వెల్లడించారు. సివాన్, సారణ్ జిల్లాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఎందుకంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article