Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుతొండంగి మండలంలో పల్లె పండుగఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపనలు

తొండంగి మండలంలో పల్లె పండుగఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపనలు

తుని :పల్లె పులకరించింది.కొత్తసొగసులద్దుకుంటున్న పల్లెలు అభివృద్ధి ప్రదాయిని యనమల దివ్యమ్మ ఆగమనంతో మురిసిపోయాయి.నీ గెలుపు ప్రగతికి మలుపు అంటూ ఎదురెళ్లి స్వాగతం పలికాయి.గత పాలకుల నిర్వాకంతో కుదేలయిన పంచాయితీ వ్యవస్థకు జవసత్వాలు అందిస్తున్న ఓ దివ్యమ్మ నిజమైన ప్రజా ప్రతినిధిగా నిలిచావు.నేటి యువనాయకత్వానికఆదర్శప్రాయమవుతున్నావు.
గెలిచిన 120 రోజుల్లోనే పల్లె పల్లె
అభివృద్ధి బాటలు నేర్చుకుంటున్నాయంటూ పల్లె పండుగ ప్రగతికి అండా జాతర‌ను సంబరంగా జరుపుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు తుని నియోజకవర్గంలో పల్లె పండుగ… ప్రగతికి అండా నినాదం మార్మోగుతుంది.ఎమ్మెల్యే యనమల దివ్య నేతృత్వంలో అభివృద్ధి పనులు దౌడు పట్టాయి.ఇవాళ తొండంగి మండలంలో పల్లె పండుగ ప్రగతికి అండా జాతర అట్టహాసంగా జరిగింది.మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన శృంగవృక్షం,పాత చోడిపిల్లిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి విచ్చేశారు.తొలుత శృంగవృక్షం విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.అనంతరం 15 లక్షల రూపాయలతో ప్రతిపాదించిన సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే
శంఖుస్థాపన చేశారు.స్థానిక నాయకులు దూలం అప్పారావు, దూలం సుబ్బారావు,జువ్వల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.అనంతరం పాత చోడిపల్లిపేట వెళ్ళిన ఎమ్మెల్యే యనమల దివ్య కు కోన ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అడుగడుగునా నీరాజనాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం 8లక్షల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.తుని నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధికి బాటలుపరుస్తున్నామని ఎన్ఆర్జీఎస్ నిధులు గ్రామగ్రామాన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.అదేవిధంగా ఎవీ నగరంలో రక్షిత మంచినీటి పధకాన్ని సీనియర్ నాయకులు యనమల రాజేష్,యనమల రాజేష్ లతో ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజలకు శ్రేష్ఠమైన త్రాగునీరుఅందిస్తామన్నారు.ఈకార్యక్రమంలోకొయ్యా కేశవ్, కొయ్యా సూరిబాబు, కాలిబోయిన చంద్రరావు,చందక చిన అప్పారావు, చొక్కా మహాంకాళి,యాదాల రామకృష్ణ, బంటుపల్లి అన్వేష్, దూలం మురళి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article