తాజా వార్తలుకూతుళ్ల‌తో క‌లిసి తిరుమ‌లకు పవన్‌..డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

కూతుళ్ల‌తో క‌లిసి తిరుమ‌లకు పవన్‌..డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

తిరుమ‌ల శ్రీవారి ప్ర‌స్తాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ 11 రోజుల పాటు ప్రాశ్చిత్త దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఆయ‌న శ్రీవారిని ద‌ర్శించుకుని దీక్ష‌ను విర‌మించ‌నున్నారు. ఇక మంగ‌ళ‌వారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. నేటి ఉద‌యం స్వామివారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య‌, చిన్న కూత‌రు పొలెనా అంజ‌ని కొణిదెల‌తో క‌లిసి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది.ప‌వ‌న్ చిన్న కుమార్తె క్రిస్టియ‌న్ కావ‌డంతో టీటీడీ అధికారులు డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు తీసుకున్నారు. ఆమె మైన‌ర్ కావ‌డంతో తండ్రిగా ప‌వ‌న్ కూడా ఆ ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. కాగా, రాష్ట్రంలో డిక్ల‌రేష‌న్ విష‌య‌మై వివాదం నెలకొన్న వేళ జ‌న‌సేనాని చేసిన ప‌నితో ఒక విధంగా ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లైంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article