Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమాజీ ఎంపీటీసీ సభ్యురాలికి మాజీ మంత్రి పల్లె పరామర్శ

మాజీ ఎంపీటీసీ సభ్యురాలికి మాజీ మంత్రి పల్లె పరామర్శ

  • అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా

పుట్టపర్తి :ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఉంటూ వైద్యం పొందుతున్న నల్లమాడ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకటలక్ష్మమ్మను మాజీమంత్రి, పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యులకు ఫోన్ ద్వారా సూచించారు. వెంకట లక్ష్మమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని పల్లె రఘునాథ్ రెడ్డి భరోసా ఇచ్చారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తనను పరామర్శించడానికి వచ్చిన పల్లె రఘునాథ్ రెడ్డికి ఆమె, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article