వందరోజు పాలనలో జనాలు నిలబెట్టడంతో లడ్డు డ్రామా కు శ్రీకారం చుట్టారు!.
వైఎస్ఆర్సిపి నియోజవర్గ కన్వీనర్ విజయరాజు
కామవరపుకోట :దేశ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు కు తగిన శాస్త్రి జరగాలంటూ చింతలపూడి నియోజకవర్గ వైయస్సార్ కన్వీనర్ కంభం విజయ రాజు అన్నారు. ఆయన పాపాలు పటాపంచలయ్యే రోజులు దగ్గర పడ్డాయి.
వైఎస్ఆర్సిపి ఎక్స్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు చంద్రబాబు నాయుడు 100 రోజులు పరిపాలనపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారా అని భయపడి తిరుపతి దేవస్థానం లడ్డులు కల్తీ జరిగిందని జంతువుల కొవ్వు ఉపయోగించారని లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేశారు , దీని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు చంద్రబాబు చేసిన ఈ పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లోనూ ప్రతి దేవాలయాల్లో కూడా పూజలు చేసి పాప ప్రక్షాళన చేసే విధంగా పిలుపునివ్వడం జరిగిందని కామవరపుకోటలోని కోటగట్టులో గల శ్రీ వీరభద్ర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహింపజేసినట్లు ఆయన చెప్పారు. ఈ పూజలలో మధ్య ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ కేసరి సరిత, కామవరపు కోట వీరభద్ర స్వామి కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శ్రీను, జడ్పిటిసి కడిమి రమేష్, ఎంపీటీసీలు తమ్మిశెట్టి గిరిజ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులతోపాటు కామవరపుకోట మండలంలోని అనేక దేవాలయాలలో ఆయా ప్రదేశాలలో వైఎస్ఆర్సిపి నాయకులు పూజలు నిర్వహించారు. తడికలపూడి గంగేశ్వర ఆలయంలో వెర్రి శీను ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహింప చేశారు. ఈ పూజలలో వైఎస్ఆర్సిపి సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.