తాజా వార్తలులడ్డూ క‌ల్తీ .. తిరుమ‌ల ఆల‌యంలో శాంతి హోమం

లడ్డూ క‌ల్తీ .. తిరుమ‌ల ఆల‌యంలో శాంతి హోమం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన దేశవ్యాప్తంగా ప్రక్షాళనలతో చర్చకు దారి తీసింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కల్తీ వ్యవహారంతో పాటు శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో వచ్చిన దోషం వలన అపచారం చోటుచేసుకుందని టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. ఈ దోషం నివారణ కోసం తిరుమల ఆలయంలో యాగశాలలో అర్చకులు శాంతి హోమం నిర్వహిస్తున్నారు.ఈ రోజు ఉదయం 10 గంటల వరకు టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ హోమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. హోమం పూర్తి అయిన తర్వాత ఆలయంలో అన్ని పోటుల్లో సంప్రోక్షణ నిర్వహిస్తామని ఈఓ శ్యామలరావు తెలియజేశారు, తద్వారా అపచారం నివారణ చేయబడుతుందని అన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article