Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుతెలంగాణ సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..

తెలంగాణ సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చక బృందం వేద ఆశీర్వచనం అందజేశారు. శుక్రవారం, హైదరాబాద్‌లోని సచివాలయంలో, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రిని కలిసి ఆశీర్వచనం అందించారు మరియు రాజన్న ప్రసాదం అందజేశారు.వేములవాడ ఆలయ విస్తరణ కోసం ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఎమ్మెల్యే మరియు ఆలయ ఈవో వినోద్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణ కోసం అవసరమైన నమూనాలకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎంకు తెలియజేశారు. వెంటనే అనుమతులు తీసుకుని విస్తరణ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాల కోసం శృంగేరి పీఠం అనుమతిని త్వరితగతిన పొందాలని సీఎం ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article