క్రీడలుఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్… టాప్‌-10లో ముగ్గురు టీమిండియా బ్యాట‌ర్లు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్… టాప్‌-10లో ముగ్గురు టీమిండియా బ్యాట‌ర్లు

తాజాగా అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు మూడు ప్రధాన ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 751 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ (740 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపరుచుకుని ఏడో ర్యాంక్‌ను సాధించాడు. విరాట్ కోహ్లీ (737 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌కు చేరాడు.ఇక పాకిస్థాన్ పరిమిత ఓవర్ల సారథి బాబర్ ఆజమ్‌కి ఈ ర్యాంకింగ్స్‌లో పెద్ద షాక్ తగిలింది. బాబర్ ఆజమ్ ఆరు స్థానాలు కిందికి పడిపోయి తొమ్మిదో ర్యాంకులో నిలిచాడు. ఇటీవ‌ల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో విఫలమైన కారణంగా అతని ర్యాంక్ క్షీణించింది.అటు పాక్ బ్యాటర్ రిజ్వాన్ తాజాగా టాప్-10లోకి ప్రవేశించి ప‌దో ర్యాంకు (728 పాయింట్లు) సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 881 పాయింట్ల‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (859 పాయింట్లు) మరియు డారిల్ మిచెల్ (768 పాయింట్లు) వరుసగా రెండో మరియు మూడో స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో జరిగిన టెస్టులో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న హ్యారీ బ్రూక్ (758 పాయింట్లు) నాలుగో ర్యాంకును సాధించడం విశేషం.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article