సినిమావయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం!

వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం!

కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 20 ల‌క్ష‌ల విరాళం

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. జులై 26న వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మృతిచెందారు. వందలాది మంది గాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న సహా పలువురు ప్రముఖులు రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివన్ తమ వంతు సాయంగా రూ.20లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ఈ సంద‌ర్భంగా ఈ జంట వారి ఇద్దరు కుమారులతో పాటు వయనాడ్‌లోని ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. “వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషాద‌క‌ర ఘ‌ట‌న‌ మా హృదయాలను క‌లిచివేసింది. సమాజం అనుభవించిన విధ్వంసం, నష్టాలు దయనీయంగా ఉన్నాయి. సంఘీభావంగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20లక్షలు అందిస్తున్నాము” అని లేఖ‌లో పేర్కొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article