Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలువిశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి.

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి.

ప్రజా భూమి కాకినాడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ నాయకులు కె.పద్మనాభం, ఎస్.ఇబ్రహీం, హెచ్ సీ సుబ్రహ్మణ్యం, శాస్త్రి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రికి సిఫార్సు చేయాలని, ప్రతీనెలా 1 వ తేదీన పింఛను చెల్లించవలెనని,అడిషనల్ క్వాన్టమ్ ను పాత పద్ధతిలో కొన సాగించవలెనని,
ఈహెచ్ఎస్ కార్డుపై పూర్తిస్థాయిలో అన్ని వ్యాధులకు వైద్య సదుపాయము అందునట్లు,మెడికల్ క్లెయిమ్ రూ.20 లక్షలనుండి రూ.5లక్షలకు పెంచాలని,
డి.ఆర్ బకాయిలు మరియు బకాయి పడిన డిఆర్ మంజూరు చేయవలెనని కోరారు.కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article