Tuesday, February 17, 2026

Creating liberating content

టాప్ న్యూస్ప్రధాని మోడీకి జగన్ 3 పేజీల లేఖ

ప్రధాని మోడీకి జగన్ 3 పేజీల లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ 3 పేజీల లేఖ రాశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వారికి ఎన్నికల్లో ఓటేయని వారిపై యధేచ్చగా దాడులు చేస్తున్నారని లేఖలో రాశారు..వైసీపీ నేతలు, వైసీపీకి సానుభూతిపరులుగా ఉన్నవారే లక్ష్యంగా అధికార కూటమి నాయకులు దాడులు చేస్తున్నారనీ, వైసీపీ నేతల ఇళ్ళు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని లేఖలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లపై దాడులు చేస్తున్నారనీ, రాష్ట్రంలో వైసీపీ ఎంపీ, ఎంఎల్ఏలుగా పోటీచేసిన అభ్యర్థులకు భద్రత కరువైందని రాశారు. 40-45 రోజులుగా రాష్ట్రంలో రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగుతోంది అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో 31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు జరిగాయనీ, 27 ఐఏఎస్, 24 ఐపీఎస్ లకు పోస్టింగులు ఇవ్వకుండా దూరం పెట్టారని జగన్ తన లేఖలో తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని జగన్ కోరారు. రాష్ట్రంలో హింసని

వివరించడానికి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article