Sunday, February 22, 2026

Creating liberating content

తాజా వార్తలు19న ఢిల్లీకి ప‌వ‌న్ క‌ల్యాణ్

19న ఢిల్లీకి ప‌వ‌న్ క‌ల్యాణ్

జ‌ల్ జీవ‌న్ సమీక్ష సమావేశంలో పాలొంటున్న ప‌వ‌న్

ఎపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి అధికారిక పర్యటన ఖరారైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఈనెల 19న పవన్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ సమీక్షకు హాజరుకానున్నారు. పంచాయతీ‌రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్. ఈ సమావేశంలో ఏపీలోని పరిస్థితులను ఆయన వివరించే ఛాన్స్ ఉంది.ఈ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో పవన్ సమావేశం అయ్యే ఛాన్స్ ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌కు ముందు కావడంతో పనిలోపనిగా ప్రధానిని కలిసి రాష్ట్రానికి నిధులను రాబట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం మోదీ అపాయింట్మెంట్ కోసం పిఎంను సంప్ర‌దిస్తున్నారు ఎపి అధికారులు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article