తాజా వార్తలుతమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ అధ్యక్షుడి కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ

తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ అధ్యక్షుడి కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ

తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ నేత కె.ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బుధవారం పరామర్శించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురయ్యాడు. చెన్నై పెరంబూర్‌లో ఈ నెల 5న ఆయన హత్యకు గురయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి కేంద్రమంత్రి నివాళులు అర్పించారు.చెన్నైలో నిర్మాణంలో ఉన్న ఆయన ఇంటి బయట కొంతమంది వ్యక్తులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఓ నిందితుడు ఆదివారం నాడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. అతను పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిని ఎన్‌కౌంటర్ చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article