Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలువైసీపీ కర్మ ఫలం ఇది.. సీమెన్స్ మాజీ ఎండీ

వైసీపీ కర్మ ఫలం ఇది.. సీమెన్స్ మాజీ ఎండీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీని ఉద్దేశిస్తూ సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన ట్వీట్ చేశారు. ఈ పరిస్థితి ఆ పార్టీ కర్మ ఫలం అని చెప్పారు. ‘న్యాయం గెలుస్తుందని నేను చెప్పిన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిజం చేశారు’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు సుమన్ బోస్ అభినందనలు తెలిపారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. సీమెన్స్‌ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం బురద చల్లిన తీరుపై గతంలో లోకేశ్, బ్రాహ్మణిలు చేసిన పోస్ట్‌లను ఆ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ తన ట్వీట్ కు ట్యాగ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article