నాడు కోడెలది అక్రమన్నారు ..
నేడు జగన్ ది
సక్రమంటే ఎలా..
నాడు ఏది కోరుకున్నారో నేడు కూడా అంతే..
చట్టం తన పని చేయాల్సిందేగా…
అధికారం శాశ్వితం కాదుగా…
నాడు మీది నేడు వీరిది…సేమ్ టి సేమ్…జస్ట్ చేంజ్…
అమరావతి
వైసీపీ అధినేత మాజీముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ చేస్తారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య ములో ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజా శ్రేయసు కంటే ప్రతిపక్షనేతలపై కక్ష్య సాధింపులకు దిగితే ఆ అధికారం కోల్పోయినతరవాత కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు నాడు ఏది చేశారో నేడు వీరు కూడా అదే చేస్తారు.
అదే నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్న ప్రాథమిక సూత్రం అందరికి వర్తిస్తుంది.ఇది తెలియని పాలకులు తామ అధికారంలో ఉన్నప్పుడు వారు వాపును చూసి బలుపు అనుకుని చేసిన చేష్టలు అధికారం పోతే అది బలుపు కాదు వాపు అని తెలిసాక చేష్టలుడిగి మౌనంగా ఉన్నా పరాభవం అనుభవించక తప్పదు.ఇప్పుడు ఇదే సహజ సూత్రం మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పడం లేదు.
ప్రతిపక్ష హోదాలో జగన్ ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఉన్నారు.ఆనాటి సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరాభవాలు ఎదురయ్యాయి.అది జీర్ణించుకోలేక అసెంబ్లీకి దూరం అయ్యారు. తరువాత అధికారంలోకి వచ్చాక కోడెల పై కక్ష గట్టి ఫర్నీచర్ దొంగిలించారని కేసుపెట్టడం అపై కోడెల అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
అయితే అదే తప్పు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి చేశారు.వైఎస్ జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ఫ్యాలేస్ కి ఫర్నీచర్ ప్రభుత్వ సొమ్మను వాడుకొన్నారనే ఆరోపణలు బైటికి భలంగా వినిపిస్తున్నాయి .ఇందులో భాగంగా కోడెల విషయం లో జగన్ ఏ విధానం అనుసరించారో ఇప్పుడు కూడా అదే విధానం పాటించడానికి సిద్దం కావడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మళ్లీ జైలు జీవితం తప్పదన్న సంకేతాలు భలంగా వినిపిస్తున్నాయి.