Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుసుంకేసుల బ్యారేజ్ నుంచి శ్రీశైలంకు నీటి విడుదల

సుంకేసుల బ్యారేజ్ నుంచి శ్రీశైలంకు నీటి విడుదల

కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజ్ నుంచి శ్రీశైలంకు శనివారం నీటి విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు కర్ణాటక ఎగువ ప్రాంతాన వర్షాలు కురుస్తుండడంతో హగరి, వేదవతి నదుల నుంచి ఆర్డీఎస్ కు నీరు చేరుతుంది. ఈ నీరు నేరుగా సుంకేసుల బ్యారేజ్ కు చేరుతుంది.దీంతో సుంకేసుల బ్యారేజ్ లో నీటి నిల్వలను కనిష్ట స్థాయిలో ఉంచుకొని, వచ్చిన నీటిలో 15,131 క్యూసెక్కుల నీటిని దిగువన నదిలోకి వదులుతున్నారు. ఆ నీరు నేరుగా శ్రీశైలం జలాశయంకు చేరుతుంది. ఇక జలాశయంలో 34 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article