తాజా వార్తలుచంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన అమరావతి రైతులు

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన అమరావతి రైతులు

ఏపీ సీఎంగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టిడిపి నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై అమరావతి రూపకర్త చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. జై అమరావతి, జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article