Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు

ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల పై బదిలీ వేటు ప‌డింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పి. శ్రీలేఖ పై బదిలీ వేటు పడింది.కర్నూలు డిప్యూటీ కలెక్టర్ ఏ.మురళి, అనంతపూర్ డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్ రెడ్డిలు కూడా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో బదిలీ వేటు పడింది. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article