Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుసీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు సతీశ్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు నేడు విచారణ చేపట్టింది. పోలీసులు సతీశ్ ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని అతడి తరఫు న్యాయవాది సలీం పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article