Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుచెరువులో నిర్మించారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రహరీగోడ కూల్చివేత

చెరువులో నిర్మించారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రహరీగోడ కూల్చివేత

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. శామీర్‌పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శుక్రవారం నాడు జేసీబీలతో ప్రహరీగోడను కూల్చివేశారు.ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి కూల్చివేతలు చేపట్టారు. ఇదే పెద్దచెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు. గత కొన్నిరోజులుగా అక్రమ నిర్మాణాలు అంటూ మల్లారెడ్డికి చెందిన, అల్లుడు రాజశేఖరె రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్‌లను అధికారులు కూల్చి వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article