Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుచర్మం ఒలిచి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి..!

చర్మం ఒలిచి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి..!

పోలీసుల విచారణలో నేరం తీరును వివరించిన నిందితుడు
మృతదేహాన్ని ఎవరూ గుర్తించరాదనే ముక్కలు చేసినట్లు వెల్లడి
ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్ కతా నలువైపులా పడేశామన్న జిహాద్ హవ్లాదార్
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కొత్త కోణం

కోల్ కతాలో ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనార్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకడైన బంగ్లాదేశ్ అక్రమ వలస కార్మికుడు జిహాద్ హవ్లాదార్ హత్య ఎలా చేసిందీ పోలీసుల విచారణలో వివరించాడు. బంగ్లాదేశ్ మూలాలుగల అమెరికా పౌరుడు అఖ్తరుజ్జామన్ ఆదేశాలతో తనతోపాటు మరో నలుగురు బంగ్లా జాతీయులు ఈ హత్యలో పాల్గొన్నట్లు చెప్పాడు. కోల్ కతాలోని న్యూ టౌన్ అపార్ట్ మెంట్ లో ఉన్న ఎంపీని తొలుత గొంతు నులిమి చంపామని పేర్కొన్నాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందు చర్మం ఒలిచి ఆ తర్వాత శరీర భాగాలు, ఎముకలను చిన్నచిన్న ముక్కలుగా చేసినట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం శరీర ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్ కతా నలువైపులా పడేసినట్లు నిందితుడు వివరించినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి.వైద్య చికిత్స కోసం మే 12న బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనార్ కోల్ కతా వచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఎంపీ శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article