Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుభారత్ లో నైరుతి రుతుపవనాలతో అత్యధిక వర్షపాతం

భారత్ లో నైరుతి రుతుపవనాలతో అత్యధిక వర్షపాతం

ఈసారి సకాలంలోనే రుతుపవనాలు వస్తాయంటున్న ఐఎండీ

మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు భారత్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించనున్నాయి. దేశంలో అత్యధిక వర్షపాతం అందించే ఈ రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా సమాచారం వెలువరించింది. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయవ్య దిశగా పయనించి మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాల్లో విస్తరించాయని, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోనూ ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడానికి అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయని వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article